కారములయి యొప్పును. వీనిభిన్నా కారములను ఈగ్రంథముయొక్క 225-వ పుటలోనీయబడిన పటములో జూడనగును. ఇతర ప్రాణుల శరీరమువలెనే మానవప్రాణిశరీరములోని అస్థి, మాంసము, త్వక్, జ్ఞానతంతువులు మొదలయిన యన్ని భాగములును కేవల జీవకణమయమై యున్నవి. ఈ జీవకణములు పని పడినటుల నెల్ల భిన్న భిన్న రూపముల దాల్చుచు, ఒకటితో నొకటి యనేక రీతుల నంటుకొని రక్తము, అస్థి, స్నాయు, మజ్జాదిరూపముల దాల్చి శరీరక్రియ నడపుచున్నవి. శరీరములోని కేశాకారముగల యొకానొకరక్తవాహిక (Artery) ను, బరీక్షించి చూచినయెడల అనేక జీవకణము లొకటినొకటి పొడువుగను గుండ్రముగను అంటుకొని గొట్టముల రూపమును దాల్చి రుధిరాభి సరణమునకు సహాయమొనర్చుచున్నవని కనబడగలదు. కొన్ని జీవకణములు పొడవుగసాగి గుంపుగ గూడి సంకోచ వికాశశీలము గలవి (That can contract and expand) యై కండరములు (కండలు:Muscles) అగును. మఱికొన్ని కణములు ఒకటి చివరనొకటి యంటుకొని టెలిగ్రాం తీగవలె పొడువై జ్ఞానతంతువగును. కొన్ని కణములు ఖనిజపదార్థములను విశేషముగ దీసికొని కఠినత కలవియై అస్థిరూపముదాల్చును. కొన్ని రూక్షములయి వెలువడి త్వ గ్రూపమును ధరించి శరీరరక్షణము జేయును. ఇట్లు వానివానిపనిని అనుసరించి, యీకణములరూపము, వర్ణము (రంగు), ఆకారము, ధర్మములు మాఱి యవి చర్మాస్థిస్నా య్వాదిరూపముల దాల్చును. ఈ చర్మాస్థిమజ్జాజ్ఞానతంతువులు మొదలయినవి శరీరమనురాజ్యముయొక్క వేఱు వేఱు మహకమాలు (Departments)
మనుష్యులందఱును మొదట నొక్కస్వరూపము కలవారలయినను, కాలము, దేశము, శీతోష్ణములు, భోజనములు, ఆచారవ్యవహారములు మొదలయిన భేదములను బట్టి కొందఱు పెద్ద పెదిమలుగల నల్లనిసిద్దీలు (Negroes) అయిరి. కొందఱు పసుపువర్ణమును, నష్ట కేశులును చుట్టుముక్కులునుగల చీనా వారయిరి. కొందఱు తెల్లనిరంగువారును, మార్జాలనయనులును, ఎఱ్ఱ వెండ్రుకలవారును అగు యూరోపుదేశస్థు లయిరి. కొందఱు మనవలె చామనచాయవా