Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిమ్మట నీ గింజపైనుండు పొట్టును వెలుపలనుండి లోపలివైపునకు ఒలువుము. ఈ పొట్టునందు రెండుపొరలు అతుకుకొని యుండును. అందు లోపలివైపుననుండు పొర మిక్కిలి పలుచనిది. ఇవి రెండును

బీజకవచములు; అనగా గింజను కాపాడుపొరలు. ఈ పొరలను రెంటిని ఒలిచివేయగా వానిలో రెండు పప్పుబద్దలు కానబడును. ఇవియే బీజదళములు. ఈ బద్దలను రెంటిని రెండువైపులకు 88-వ పటములో జూపినట్లు విడదీసిచూడుము. ఇట్లు విడదీయగా రెండు బద్దలమధ్య కొక్కెమువలె పై వైపునకు వంగిన మొనగలభాగమొకటి మచ్చసమీపమున గానవచ్చును. ఇది ప్రథమమూలము (Radicle)

దీని క్రిందిభాగమున దీనితో జేరి కోమలమైన తెల్లని చిన్నఆకులు రెండు ముడుచుకొని మొగ్గవలె, రెండు బద్దల మధ్య నిమిడియుండును. ఈ చిన్న చిన్న యాకులుగల భాగమునకే ప్రథమశాఖాంకురము (Plumule) అని పేరు. ఇదియే మొక్కగా పెరుగునట్టి భాగము.