భృంగాదులు.
భృంగాదులు
పుష్పములు భృంగాదులను తమచక్కదనముచే నాకర్షించి తమ వాసనలచే నానందింపజేసి, తమ మకరందమును వానికి కానుకగా నిచ్చును. అందు కొన్ని పురుగులు దుర్వాసనయందు ఆసక్తిగలవగుటచేత, వానికి తృప్తి కలుగజేయుటకై కొన్నిపుష్పము లాదుర్వాసనలగూడ భరించియుండును. ఇంక నవి యెన్నెనో చోద్యములను చేయును. వీనినిగూర్చి యిచ్చట వ్రాయుటకు స్థలముచాలదు. ఈ భృంగాదుల రాకపోకలచే వీలుపడినంత యుపయోగమును పొందుటకుగాను కొన్ని పుష్పములు ప్రత్యేకమైన ఆకారములను గలవిగాగూడ సృజింపబడినవి. ఎట్లన, వానియందలి మకరందము పుష్పముయొక్క మొదటిభాగమున నెక్కడనో లోపలగా నొక ప్రత్యేకతిత్తిలో కూర్చి పెట్టబడును. దానిని త్రాగుటకై యీ భృంగాదులు పుష్పములపై గూర్చుండునప్పుడును, అవి వంగి మకరందమును త్రాగునప్పుడును, తటాలున లేచి ఎగిరి పోవునప్పుడును అనాలోచితముగా (Unconsclously) తమ శరీరముమీద కింజల్కములనుండి రాలెడు పురుషబీజముల ధరించి వానిని ఇతరపుష్పములలోనికి గొనిపోయి యందలి స్త్రీ పత్రముల కొసంగును.
ఇట్లు భృంగాదులశరీరమునుండి రాలిన అన్యపుష్ప కుటుంబములోని పురుషబీజము ఆండాశయముయొక్క కొనదిమ్మపై బడి దానినుండి స్రవించుచుండు జిగటపదార్థముచే దాని నంటుకొనిపో