Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనేక అండాశయములుండి అనేక కాయలుపుట్టును. ఈ కాయలన్నియు నొక్క గుత్తిలోనుండును.

మరికొన్ని పుష్పములలోని అండాశయములన్నియు 78-వ పటములో 1 లో చూపబడిన ప్రకారము మధ్యభాగమునగాని 2 లో చూపబడిన ప్రకారము అంచునగాని అంటుకొనిపోయి ఒక్క కాయగా నేర్పడును. 79-వ పటములో బెండకాయను

అడ్డముగాకోయగా నేర్పడు రూపము చూపబడినది. అందు 7 బిలములు గలవు. ఒక్కొకబిలములో ఒక్కొకగింజ కనబడుచున్నది. అండాశయము లొకదానిప్రక్క నొకటి జేరియుండుటచేతనే నారింజ, పంపరపనస మొదలగువాని కాయలయందలి తొన లేర్పడుచున్నవి. ఇం దొక్క తొన యొక్కొక అండాశయము.

స్త్రీపురుషసంయోగము.

సామాన్యముగా నేక పుష్పమునందే పురుషపత్రములును, స్త్రీపత్రములును రెండును గలవని చెప్పియుంటిమి. ఇట్లుండినను