పుట:Jeevasastra Samgrahamu.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్త్రీ పత్రములు.

అట్టి సంచియొక్క మొదలును చివరయును సన్నముగను మధ్యభాగము లావుగను ఉండును. అందు చివరభాగము మిక్కిలిపొడుగుగ నెదిగి యొక కాడవలె నగును. దానికి కొనకాడయని పేరు. (76-వ పటములో కొ. కా. చూడుము). ఆకాడచివరనుండు గుండువంటి భాగమునకు కొనదిమ్మ యనిపేరు (కొ. ది.) ఈ కొనదిమ్మనుండి యెల్లప్పుడు నొక జిగురుపదార్థము స్రవించుచుండును. బోలుగనుండు గొట్టము వంటి మధ్యభాగమునకు పొట్టయని పేరు. దానిపొట్టయొక్క లోపలిభాగమున మధ్య ఈనెకు ఎదురుగనుండు అంచు పొడుగునను ఉబ్బి యొకతలగడవలె నేర్పడును. ఈతలగడకు అండపోషకమనిపేరు. ఈతలగడ హెచ్చుజాతి జంతువుల స్త్రీలగర్భమునందుండుమావి (Placenta) వంటిది. చిన్న చిన్నతొడిమలచే నీ మావి నంటిపెట్టుకొని కొన్ని యండాకృతిగల స్థూలబీజాశయము లుండును. ఈస్థూలబీజాశయములే గింజలగును. ఈగింజలు జంతుజాతిశిశువులవలెనే మావి ద్వారా తమ తల్లి గర్భముయొక్క గోడ నంటియుండుటజూడ నీ రెంటికి గలసారూప్యము వెల్లడికాగలదు. ఈ స్థూలబీజాశయము లను అండములు (అనగాగ్రుడ్లు) అనియు వాడుదురు. ఇట్టి అండములుగలతి త్తియే అండాశయము. సామాన్యముగా నిట్టిఅండాశయము ఒక్కొక పుష్పమునందు ఒక్కొక్కటియేయుండును. అట్టి పుష్పమునుండి యొక్క కాయయేపుట్టును. ఆ కాయయందు ఒక్కటే బిలము అనగా అరయుండును. కొన్నిపుష్పములందు