లట్లుకాక యెల్లప్పుడు పుష్పము నంటియుండి దానిని సంరక్షించుచుండును. కొన్నిటియం దీ రక్షకపత్రములు తమపొరుగుననుండు ఆకర్షణపత్రములవలె రమ్యమైనవర్ణము కలిగియుండి పుష్పము యొక్క అందమును ఆకర్షణశక్తియును హెచ్చించును. ఎర్రకలువ మొదలగు కొన్ని పుష్పములందు ఈరక్షకపత్రములు కొంచె మాకుపచ్చగను, కొంచె మెర్రగను ఉండి కలువయాకుయొక్క ఆకుపచ్చరంగునకును, కలువపువ్వుయొక్క యెరుపురంగునకును మధ్యవర్ణమును దాల్చియుండును. మొగలి పొట్ట, మొక్క జొన్న పొట్ట, అని మనము వాడుకొను భాగములు పూవులే. వాని రక్షకపత్రములు కొంచె మొంచుగ నాకులవలెనే యుండును. కాన ఆకుపచ్చగనుండు ఆకునుండి వివిధవర్ణములుగల పుష్పములయొక్క రేకులు పరిణమించుటలో నీ రక్షకపత్రములు మధ్య మెట్టుగా గ్రహింపనగును.
2. ఆకర్షణపత్రములు.
ఇవి వివిధములై నరంగులు గలవిగను, స్ఫుటమైనవిగను ఉండి భృంగాదులకన్నులకు విందు జేయునట్టి పలుచని రేకులు (71-వ పటములో ఆ). సామాన్యముగా ననేక పూవులందు తామర పుష్పమునం దున్నట్లు రేకులు వేర్వేరుగా నుండును. కాని పచ్చ గన్నేరు, ఉమ్మెత్త మొదలగు పూవులందువలె రేకు లొక దానితో నొకటి జేరి గంటవలె నుండవచ్చును. ఈ రేకులు తురాయిపువ్వులో నున్నట్లు ఒక్క వరుసగా నుండవచ్చును. తామరపువ్వులో నున్నట్లు అనేక వరుసలుగాగూడ నుండవచ్చును..
ఆకర్షణపత్రముల పేరు ననుసరించియే వీని వ్యాపారముచే భృంగాదుల నాకర్షించుట యైయున్నది. ఈ విషయమై డార్విను