పుట:Jeevasastra Samgrahamu.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. గింజలు.

పై నిజెప్పిన సంతానవృద్ధిచే నేవో కొన్నిజాతులుమాత్రమే వ్యాపించుచుండునుగాని అనేకజాతులు క్రింద చెప్ప బోవునట్లు స్త్రీపురుషసంయోగమువలన ఏర్పడిన గింజలమూలముననే స్వజాత్యభివృద్ధి జెందును. ఇట్టిగింజలు దేశ దేశములకు ఎగుమతికాగల వగుటచే వృక్షములు తమజాతిని మిక్కిలి దూరపుప్రదేశములకు సహితము వ్యాపింపజేయగలవు. ఇందుకొర కనేకవృక్షము లిట్టి సంతానవృద్ధినే కోరుచుండును.

స్త్రీపురుష వృక్షములు.

స్త్రీపురుష సంయోగసహితమైన సంతానవృద్ధికి పుష్పములు సంయోగావయవములు. తాడి, బొప్పాయి మొదలగు వృక్షజాతులలో కొన్ని పోతుచెట్లును (అనగా మగవియును) మరికొన్ని ఆడుచెట్లును గలవు. మగచెట్ల పూవులయందు పురుషాంగములు (కేసరములు) మాత్ర ముండును. ఆడు చెట్లయందు అండాశయములు *[1]మాత్ర ముండును. ఇట్టి వృక్షములకు ఏకాంగు లనిపేరు. ఇవి గాక యనేక వృక్షములు స్త్రీపురుషాంగముల రెంటిని ఏక వృక్షమునందే కలిగియుండును. వీనికి ఉభయాంగు (మిథున వృక్షములు) లని పేరు. ఇందుకొన్ని చెట్లలో పురుషాంగములు ఒకపుష్పమునందును, స్త్రీసంబంధమైన యంగములు మరియొక పుష్పమునందును ఉండును. ఉదా:- ఆముదపు చెట్టునందు మగపువ్వులును, ఆడు పువ్వులును వేరువేరుగ నుండును. 69-వ పటము

  1. * అండాశయము:- మొదటి కూర్పు నందు దీనినె పుష్పగర ము అని వాడియుంటిమి. ఆ. ల.