Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విడిచి యొకటిగా త్వక్కు చుట్టును అమరియుండును. దారుపుంజములును, త్వక్కుపుంజములును సమసంఖ్యకములుగానుండును. వీని రెంటిమధ్య నుండు కొన్ని మృదుకణములు వీనిని రెంటిని వేరుపరచుచుండును.

వాహికాపుంజముల వెలుపలివైపున నొడ్డాణము (Pericycle) ఒకటి గలదు. ఇందలికణములు మూలపదార్థ సహితములైన మృదుకణములు.

ఈ యొడ్డాణమునకు వెలుపలివైపున అంతశ్చర్మమనునొక కణములవరుస గలదు.

దీనికి వెలుపలివైపున అనేకవరుసల కణములు గలవు. ఈ భాగము పట్ట. ఈ పట్టకు వెలుపల అన్నిటిలో చిట్టచివర కవచమగు బహిశ్చర్మకణములవరుస గలదు.

బహిశ్చర్మనుండి యక్కడక్కడ రోమములు పుట్టుచుండును. ఇవి యెల్లప్పుడు ఏకకణములు, అనగా నీ కణము లెన్నడును చీలవు. వీనివ్యాపారము భూమినుండి నీటిని పీల్చుట.

పిల్లవేరుల యుత్పత్తి.

ఇవి ఆకులవలెను కొమ్మలవలెను బాహ్యలింగ, పరిలింగములనుండి పుట్టునవి కావు. అంతర్లింగములోని భాగమైన యొడ్డాణమునందలి కణములు కొన్ని విభాజ్యకణములుగా పరిణమించి (Become Meristematic) యవిచీలి యొక మొటిమ పుట్టును. ఆ మొటిమలో వెంటనే బాహ్యలింగ, పరిలింగ, అంతర్లింగ సంహ