ఈ పుట ఆమోదించబడ్డది
వేరుయొక్క-సూక్ష్మనిర్మాణము.
- ద్విబీజదళవృక్షముయొక్క వేళ్లు. ఏకబీజదళవృక్షముయొక్క వేళ్లు.
ఏకబీజదళవృక్షములలో తల్లివేరు లోతుగ నెదుగదు (66-వ పటము చూడుము). అది మొండిదిగను పొట్టిదిగను ఉండి యనేములైన చిన్న చిన్న పిల్ల వేరులుగా చీలును. ఇవియన్నియు బోదెయొక్క మొదటిభాగమునుండియే పుట్టును. ఈతచెట్టు, తాటిచెట్టు వీని వేళ్లను చూడుము.
వేరుయొక్క సూక్ష్మనిర్మాణము.
వేరుయొక్క సూక్ష్మనిర్మాణమునకును, శాఖయొక్క సూక్ష్మనిర్మాణమునకును భేదములు స్వల్పములుగా నున్నవి. ప్రతివేరుయొక్క కొనయందును మూలరక్షణమను టోపివంటి భాగముండును. అదిగాక తక్కిననిర్మాణము చాలవరకు కొమ్మయొక్కనిర్మా