పుట:Jeevasastra Samgrahamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీనినిభక్షించి గడ్డి, ఉలవలు, అభివృద్ధియగును. అట్టి గడ్డి ఉలవలు తిని గుఱ్ఱము బలియుచున్నది. ఇదియుగాక ఒకానొకచోటమాత్రము క్రొత్తపదార్థము అతికినందున జడపదార్థము పెరుగును. అనగా ఆపెరుగుట పదార్థముయొక్క యొకానొక భాగమునందుగాని, చుట్టుమాత్రముగాని ఉండును. అంతట నుండదు. జీవియొక్క పెరుగుట యటువంటిది గాదు. తన దేహములోని ప్రతియవయవమును ప్రతికణమును పెరిగినందువలన జీవి పెరుగును. దీనికే నేంద్రియవృద్ధి (Organic growth) అనిపేరు.

3. సంతానవృద్ధి :- తనవంటి జంతువునుకనుట జీవియొక్క యొకవిశేష ధర్మము. ఈ పునరుత్పాదనవిధము లనేకములుగలవు. స్త్రీపురుషసంయోగమువలన సంతానోత్పత్తి యగుట మనము హెచ్చుజాతి జీవులయందు జూచుచున్నాము. కాని అణురూపములయిన మిక్కిలి తగ్గుజాతులలోని జీవులలో స్త్రీపురుషవిభేదము లేదు. అట్టి యొక జీవి రెండు గాదెగి యా రెండుభాగములును రెండు స్వతంత్రజీవులగును. దీనికి ద్విఖండన సంతానవృద్ధి విధానమని పేరు. ఇందునగుఱించి యధికము తెలిసికొనగోరువారు ఈగ్రంథముయొక్క 16-వ పుటలో జూడనగు.

4. మరణము :- పైన వర్ణింపబడిన వ్యాపారములన్నియు మాని జడత్వము జెందుట మరణము. ఇట్టిమరణము జడములకు లేదు.

వృక్షములకు జీవము కలదా?

సచేతనములలో వృక్షములనియు, జంతువులనియు రెండు భేదములు కలవని యిదివఱకే చెప్పియున్నాము. వృక్షాదులు జంతువులవలె స్థలాంతరము జేరక యొక్కచోటనే నిలచియుండుటచే నవి సచేతనములు గావని కొందఱు భ్రమపడుచున్నారు. కాని యది నిజముకాదు. చలనము జీవత్వమునకు ఒకముఖ్యలక్షణముకాదు. చలనములేకయ సచేతనత్వముండవచ్చును. చలనముండియు జడత్వ ముండవచ్చును. ఇదియుగాక పెద్ద పెద్దజంతువులకు జంగమత్వ మున్నను, చలనములేక యొక్కచోటనే యుండు అతిసూక్ష్మజంతువులు కొన్ని కలవు. సాధారణముగ వృక్షములకు జలనములేక పోయినను అతిసూక్ష్మ వృక్షములు