నిర్మాణభేదములు.
ఆకుల అంచు.
కొన్నిటి అంచులు మర్రిఆకుల అంచులవలె నున్నగనుండును. వేపాకు అంచువలె కొన్నిటి అంచు ఎగుడుదిగుడుగ నుండు పండ్లు గలిగియుండును. కొన్ని దర్భవరిఆకులవలె సన్నని రంపపు కక్కులవంటి కక్కులు గలిగియుండును. కలబంద అనాసలవంటి మరికొన్ని ఆకుల అంచులయందు ముం డ్లుండును.
ఆకుల అగ్రము.
కొన్నిటి అగ్రము పొన్న ఆకు మర్రిఆకు కొనలవలె గుండ్రముగ నుండును. కొన్నిటి కొన తోకవలె పొడుగుగ నుండును. రావియాకు చూడుము.
రోమములు.
కొన్ని ఆకులమీద నూగు అనబడురోమము లుండును. దూలగొండి మొదలగువానియం దీరోమములయం దొకవిధమైన విషపదార్థము స్రవించి నిలువయుండును. అట్టి యాకును తాకినప్పుడు దానిరోమములు పగిలి యందలివిషము మన శరీరమున కంటుకొని జిల పుట్టించును.
నిర్మాణభేదములు.
ఆకులయొక్క నిర్మాణమునుబట్టి వానియందు రెండువిభాగములు గలవు.
1. మిశ్రమపత్రములు (Compound Leaves).
2. లఘుపత్రములు (Simple Leaves).
మిశ్రమపత్రము.
ఒక్కచోట సంథించునట్టిగాని, ఒక తల్లియీనె నంటియుండునట్టిగాని చిట్టిఆకు లనబడు వేరువేరుభాగములుగా విభ