పుట:Jeevasastra Samgrahamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సరిచేసుకొను ఆయంత్రమునందు లేదు. ఈ యంత్రములెంత విచిత్రరచనమునను తమవంటి రెండవయంత్రమును పుట్టింపనేరవు. జీవు లనుయంత్రము దమ వ్యాపారములను జేయు సామర్థ్యము స్వయముగాగలదు. అది పదార్థములవలన వానికి రానక్కరలేదు.. ఇందలికీ లేమైనను చెడినయెడల బాగుచేసికొనుసామర్థ్య మీ శరీరయంత్రములందు గలదు; తమవంటి యంత్రముల బుట్టించు సామర్థ్యము గలదు. ఇది యీరెండు యంత్రములగల తారతమ్యము. ఇట్లు జడపదార్థములకును సచేతనపదార్థములకును యొకభేదము గనపఱచి అచేతనములకు లేనట్టి సచేతనములకు గల ధర్మముల బేర్కొనియెద:

2. ఉత్పత్తి:- తమవంటి మఱియొక జీవినుండి యుత్పత్తియగుట జీవుల ధర్మము. ఏజీవియు దనంతట దాను కలుగదు. దానికి జనకస్థానమునమఱి యొక జీవియైనను ఉండవలెను. హెచ్చుతరగతి జీవులకు దలిదండ్రులు జన్మహేతువులగు రెండుజీవు లుండును. తగ్గుజాతిజీవుల యుత్పత్తియొక జీవివలనే గలుగుచున్నది.

3. వృద్ధి (పెఱుగుట) :- తమచుట్టునుండెడి విజాతీయ (Hetero---) పదార్థములను లోనికిదీసికొని వానిని రాసాయనరీత్యా (Chemi--) పృథక్కరించి (Analyse) వానిలోనుండి తనశరీరమునకు నావశ్యకమైన పదార్థములను దీసికొని తద్వారా సర్వావయవములను, సర్వశరీరమును చేయు సామర్థ్యము జీవులకుగలదు. అచేతనపదార్థములుకూడ పెరు-----నముచూచుచున్నాము. కృష్ణాగోదావరులలోని లంకలు పెరుగును; ---లు (Crystals) పెరుగును. కాని యీజడపదార్థములన్నియు సజా-----ర్థములు తమపై వచ్చిపడినందున బెరుగును. క్రమక్రమముగా ఇసుక మొదలయిన ద్రవ్యములపొరలు ఒకటిపైనొకటి వచ్చి చేరినందున లంక----ఏకజాతీయ కణములు ఒకటిపైనొకటి చేరుటవలన స్ఫటికము పెరువుల యభివృద్ధి అటువంటిదికాదు. గాలిలోని బొగ్గుపులుసుగాలి (కర్బనము Carbon Dioxide), భూమిలోనిజలము, కొన్ని లవణములు