Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బడెను. ఈకొమ్మయొక్క అడ్డపుచీలికలయందలి వాహికాపుంజములు సూక్ష్మదర్శనిలో జూచినప్పుడు చుట్టునొక తోరణమువలె క్రమమైనరీతిని యమర్పబడుట యీసమాంతరవ్యాపకము మూలముననే యని యెరుంగునది.

ఏక బీజదళవృక్షములో నీ వాహికాపుంజములు నిలువున కొమ్మలో నొక్కరీతిగ వ్యాపించవు. కొన్ని యుపరితలమునకు సమీపమునను కొన్ని దూరమునను చెల్లచెదరుగా నుండును. సామాన్యముగా ఏక బీజదళవృక్షముల ఆకులు వెడల్పయిన మొదలుగలవి. ఈఆకులనుండి వాహికాపుంజములు కొమ్మలో ప్రవేశించిన తోడనే తిన్నగా కొమ్మ పట్టనడిమికి బోవును. (52-వ పటములో చూడుము). తరువాత నవి క్రమముగా కొమ్మయొక్క యుపరితలమును సమీపించి ప్రాతఆకులనుండి వ్యాపించిన వాహికాపుంజములలోనికి పోయి చేరును.

అంత్యవిభాజ్యము.

నాచు మొక్కయొక్క కొనయందు అంత్యకణ మొకటిగలదనియు, దానివిభాగమువలన కొన్నిఖండము లేర్పడుచు, ఆఖండమునుండి స్కంధశిర, స్కంధకణము లేర్పడి వానినుండి కొమ్మలు, ఆకులు, వేళ్లు ఇవియన్నియు నేర్పడు చున్నవనియు చెప్పియుంటిమి. హెచ్చుజాతివృక్షములలోగూడ శాఖాంతమున కొనమొగ్గ గలదు.