డును విభజన నొందుచుండుటచే వానినుండి క్రొత్తక్రొత్త పొరలేర్పడుచు నందు వెలుపలివైపుపొరలు క్రొత్తదారువుగను, లోపలివైపుపొరలు క్రొత్తత్వక్కుగను ఏర్పడి యవి చెట్టుయొక్క లావును క్రమముగ పెంచుచుండును. ఏకబీజదళ వృక్షములలో నట్టి పునర్వృద్ధి (Secondary growth) కి తగిననిర్మాణము లేదు. ఇంతేకాక చెట్టుయొక్క లావు అధికముకాకుండ బిగించికట్టినట్లుండెడు ఒడ్డాణము (Pericycle) యొక్క నిర్మాణముగూడ దాని లావును హెచ్చకుండునట్లు జేయుచుండును.
వాహికాపుంజముల వ్యాపకము.
వాహికాపుంజములు ఆకులనుండి కొమ్మలోనికి ప్రవేశించి, దానిగుండ నిలువున కొమ్మ పొడుగునను పోయి వేళ్లలోనికి చేరునని వ్రాసియుంటిమి. అట్టి వ్యాపకములో ఏకబీజదళవృక్షములకును, ద్విబీజదళవృక్షములకును భేదము కలదు.
ద్విబీజదళవృక్షములలో నీ వాహికాపుంజము లన్నియు కొమ్మయొక్క యుపరితలమునకు సమాంతరముగ బోవును. ప్రక్కపటములో వాని మార్గము నిలువున జూప