కాన ఇందు పీచు అధికముగ నుండును. ఈయొడ్డాణముయొక్క యుపయోగము క్రింద వివరింపబడును.
5. ఏకబీజదళవృక్షమునందు వాహికాపుంజములు తోరణమువలె చుట్టునొకవరుసగా నమర్పబడియుండక పై జెప్పిన యొడ్డాణపు లోపలితట్టున కణములమధ్య చెల్లా చెదరుగా చిమ్మబడియుండును. గాన దీనియందు కిరణములు లేవు. వీనియందలి వాహికాపుంజములు పంగ నామములవలె (V shaped) లోపలివైపు సన్నముగను వెలుపలివైపు లావుగను ఉండును. ఇందును త్వక్కు (Phloem) దారువు (Wood) అని రెండుభాగములును గలవు. లోపలివైపున నుండు దారువునందు దృఢకణములును, దారువాహికలును ఉండును. వెలుపలివైపుననుండు త్వక్కునందు మృదుకణములును జల్లెడ రేకులుగల కాలువలు నుండును. దారువునకును త్వక్కునకును మధ్య విభాజ్యకణములు (Meristematic) లేవు.
కొబ్బెర మొదలగు ఏకబీజదళవృక్షములు సామాన్యముగ కొంత లావుగ పెరిగి అంతట నిలిచిపోవును. చింత, టేకు, మద్ది మొదలగు ద్విబీజదళవృక్షములు విరివిగ ఎదిగినకొలదిని లావునందును హెచ్చుచుండును. ఇట్టిభేదమునకు కారణము వాని నిర్మాణమును పరీక్షించిన బోధపడగలదు. ద్విబీజదళవృక్షములలో వాహికా పుంజములందలి దారువునకును, త్వక్కునకును మధ్య విభాజ్యకణములవరుస యొకటిగలదని చెప్పి యుంటిమి. ఈకణము లెల్లప్పు