దెక్కుడు చక్రములు కలది గంటలుకొట్టును. తేదులు, నెలలు, వారములు చూపు గడియార మితరగడియారములకంటె నెక్కుడు చక్రములును ఎక్కుడు నిర్మాణ చమత్కారమును గలిగి యుండును. ఇటులనే జీవులవిషయ మై యెఱుంగ వలయును. ప్రాణికోటిలో రాజని చెప్పదగు మనుష్యుని శరీరములోని యవయవరచన మత్యంతచమత్కారముగాజేయబడినది. అందునితరప్రాణులకంటె నెన్నియో అవయవములు, వెలుపలను లోపలనుగలవు. అందుచే మానవశరీరవ్యాపారములు ఇతరజంతువులకంటె నధికముగాను, ఎక్కువ యోగ్యత, ఉపయోగము కలవిగాను ఉండును. అవయవనిర్మాణము ననుసరించియె మానవుని యందు వాక్కు, బుద్ధి, మేధ మొదలయిన విశేషంబులున్నవి. మనము తగ్గుజాతి జీవులను జూచిన కొలదిని వానియందు, ఇంద్రియరచనయు, ఇంద్రియ వ్యాపారములును, విజ్ఞానమును తగ్గుచున్నటుల గానవచ్చెడిని. మిక్కిలి తక్కువ జాతిది యగువికారిణి (Amoeba) శరీరము జూచినయెడల అందు పంచజ్ఞానేంద్రియ పంచకర్మేంద్రియముల వ్యాపారములన్నియు నొక్క త్వగింద్రియమే చేయుచున్నటుల గానవచ్చును. అందుచే దానివ్యాపారంబులును, విజ్ఞానంబును మిక్కిలి తక్కువగనుండును. ఈలాగు మిక్కిలి తగ్గుజాతి జీవులు మొదలు హెచ్చుజాతి జీవులవఱకు అవయవరచనా నైపుణ్యంబును విజ్ఞానవృద్ధియు గానవచ్చెడిని. కేవల జడపదార్థములలో నీశరీరనిర్మాణవై చిత్ర్య ముండదు. ఇనుము గాని రాయిగాని చూచినయెడల అందు పతమాణువులన్ని యు కూడి యొక ముద్దవలె నుండునేకాని, యందు సృష్టిలోని యొకశక్తిని మఱియొక శక్తిగా మార్చు యంత్రనిర్మాణమువంటి నిర్మాణ ముండదు. ఇది చేతనా చేతనములకు గల యొక పెద్దభేదము. ఇట్లు యంత్రములకును జీవులకును బోల్చుట జూడగా సాధారణ యంత్రములకును, జీవశరీరములకును నేమియు భేదములేదని చదువరులు భ్రమపడుదురేమో. కాని వీనికి సామ్యమున్న టులనే భేదముకూడ గలదు. మనము చూచెడి యంత్రములు నడచుటకు వెలుపలి సామర్థ్యము కావలెను. గడియారములోని చక్రములు నడచుటకు స్ప్రింగ్ కావలయును. ఎంజిన్ నడచుటకు ఆవిరి కావలయును. ఈ యంత్రములలోని యేభాగము చెడిపోయినను యంత్రము ఆగిపోవును. ఆ చెడిపోయినభాగమును
పుట:Jeevasastra Samgrahamu.pdf/30
Appearance