ఈ పుట ఆమోదించబడ్డది
దము. ఇందునిమిత్తమై యొక జొన్న మొక్క యొక్క లేత కొమ్మను సన్ననితునియలుగ ఖండించి వానిని8 సూక్ష్మదర్శనితో పరీక్షింపుము.
1. అందు పటములో జూపినప్రకారము వెలుపలితట్టున బహిశ్చర్మకణము (Epidermal cells) లొక వరుసగా నుండును.
2. దాని లోపలితట్టున పెక్కు వరుసల చదరపుకణముల పేర్పు లుండును. వీని కణకవచము కొంచెము దళసరిగ నుండును. ఇదియే పట్ట (Cortex).
3. వీని లోపలితట్టున అంతశ్చర్మకణముల (Endodermis) వరుస యొకటుండును. అయిన నీ వరుస ద్విబీజదళవృక్షములలోవలె చక్కగా తెలియదు.
4. ఈ అంతశ్చర్మముయొక్క లోపలితట్టును సామాన్యముగా నేకబీజదళ వృక్షములలో పొడుగైన దృడకణములచే నేర్పడిన మిక్కిలి బలమైన నవారుపట్టెవంటి పట్టె యొకటి కొమ్మచుట్టును బిగువుగ నుండు ఒడ్డాణము (Pericycle) వలె చుట్టియుండును. ఇందలికణములు దళసరెక్కి కాఠిన్యము నొందియుండును.