Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరికొన్నిటియందు మరచుట్లువలెను (Spiral) కొన్నిటియందు గుంటలుగుంటలుగను (Pittrd) సూక్ష్మదర్శనిలో జూచునప్పుడు స్పష్టముగ తెలియుచుండును.

(3) దారువునకును త్వక్కునకును మధ్యనలుచదరపుకణములవరుస యొకటిగలదు. ఈకణములు నిరంతరము విభజనము నొంది వృద్ధిబొందు స్వభావముగల వగుటచేత నియ్యవి విభాజ్యకణములు (Meristem) అనబడును.

షరా:- ఈ విభాజ్యకణములవరుస వాహికాపుంజముల మధ్యనుండు కిరణములగుండకూడ నెడతెగక వ్యాపించుచు శాఖయొక్క మధ్యభాగము చుట్టు నొక కడియము వలె నుండును.

5. ఈ వాహికాపుంజముల తోరణమునకు లోపలితట్టున పలుచని కణకవచములుగల బహుభుజకణములు ఒక దానినొకటి జేర్చి పేర్పబడియుండును. ఈ భాగమునకు దవ్వయనిపేరు. ఇందలికణములు పొడుగునను వెడల్పునను సమానముగా నుండును. ఇవియే మృదుకణములు (Parenchyma). ఈ భాగమునందు దృఢకణములు బొత్తిగ నుండకపోవుటచేత నిందు పీచు ఉండదు.

ఇంతవరకు ద్విబీజదళవృక్షశాఖయొక్క సూక్ష్మనిర్మాణము చెప్పబడెను.

II. ఏకబీజదళశాఖ.

ఇక నేక బీజదళముయొక్క శాఖానిర్మాణమును పరీక్షించె