ఈ పుట ఆమోదించబడ్డది
కొమ్మయొక్క కంతిగా పుట్టును (47-వ పటము చూడుము).
ఈ దుంపలను శ్రద్ధగా పరీక్షించిన అందు కండ్లవలె గుంటలుగ నుండు చిన్నచిన్న మచ్చ లుండును. ఈ దుంపలను పాతిపెట్టినప్పుడు ప్రతి మచ్చనుండియు నొక మొక్క పుట్టును. ఈమొక్కలు భూమినుండిబయలు వెడలి తమ యాహారమును తాము సంపాదిందుకొను వరకును దాని నీ దుంపయే ఇచ్చుచు స్వజాతివృద్ధికి సహాయపడును. పటములో జూచినయెడల దీనికంతులు ఆకుపైనుండు పంగలలో పుట్టుచున్నట్లు తెలియగలదు. కాన నీకంతులు శాఖలయొక్క రూపాంతరములనుటకు సందేహము లేదు.
5. గడ్డలు (Bulbs):- నీరుల్లిగడ్డయొక్క మధ్యభాగము కూడ కొమ్మయేకాని వేరు కాదు. దాని చుట్టునుండు దళమైనపొరలు దాని మొదటియాకులు. ఈ యాకులయందు ఆహార