పుట:Jeevasastra Samgrahamu.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుండి తమ యాహారమును కొద్దికొద్దిగ జేర్చుకొనవలయును. ఇట్టి యాహారమును వృక్షము అనేక ముఖముల స్వీకరించినగాని దానికి వలసినంత యాహారము దొరకజాలదు. దీనిని సంపాదించుటకు వృక్ష మెంతవిరివిగ పత్రముల వ్యాపింపజేసిన నంతయనుకూలము. ఒకవృక్షమున కొక్కటే కొమ్మయుండి దానిఆకులు విస్తారము స్థలము నాక్రమింపవలెనన్న యెడల నాయాకులు మిక్కిలి పెద్దవిగ నుండవలయును. ఇది యసందర్భము. ఇట్టికొరతనుదీర్చి చెట్టును విరివిగ విస్తరింపజేయునిమిత్తమై ఉపశాఖలనిర్మాణమేర్పడినది. కాన శాఖయొక్క మొదటివ్యాపార మేదన:- ఆకులను భరించి ఆ యాకులు తమతమవ్యాపారముల జక్కజేయునిమిత్తమై వానిని విరివిగ వ్యాపింపజేయుటయే.

2. పుష్టికరములగు రసములను ఆకులనుండి వృక్షశరీరమున కంతటికిని, జీవనాధారములగు నీరు మొదలగువానిని వేళ్ళనుండి ఆకులకును ప్రసరింపజేయు వాహికలను భరించుట. ఈవిషయమై కొంతవరకు ఇంతకుముందే వ్రాయబడినది.

3. అంటులు (Grafts):- మల్లె, గులాబి మొదలగు మొక్కలయందువలె కొమ్మలు అంటులుగా నేర్పడి స్వజాతివృద్ధికి సహాయపడును.

4. కంతులు (Tubors):- బంగాళాదుంప (Potato) చూచుటకు గడ్డదినుసుగా నున్నను అదియును శాఖావిశేషమే. ఇది తక్కిన గడ్డదినుసులవలె వేళ్లనుండి పరిణమించునదిగాక,