ఈ పుట ఆమోదించబడ్డది
ములో జూపినప్రకారము ఆకులయందు ప్రారంభించి, వాని తొడిమలగుండ గుంపులు గుంపులుగచిన్న కొమ్మలలోనికిజేరి, వానిగుండ తల్లికొమ్మద్వారా వేళ్లయొక్క చివరభాగము వరకుపోవును. ఇట్టికాలువల గుంపులకు వాహికాపుంజము లని పేరు.
సామాన్యముగ ప్రతియాకుయొక్క యుపరి తలమునను మనముపరీక్షీంచి చూచిన ఒకటి మొదలు నాలుగైదు వరకు పెద్ద ఈనెలును, వానినుండి వెలువడు చిన్న చిన్న నారపోగులవంటి యీనెలాల్లికలును గానవచ్చును. ఈయల్లికలలో రెండు ముఖ్యమైన భేదములు గలవు. ఆభేదములబట్టి