పుట:Jeevasastra Samgrahamu.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ వరుసయందలికణము లన్నిటికి ఏకమార్గ మేర్పడును. ఇ ట్లేర్పడిన కాలువలకు జల్లెడకాలువలు (Sieve tubes) అని పేరు. ఈకాలువలు కొమ్మయొక్క త్వక్కు అను వెలుపలిభాగమున పొడుగునను సామాన్యముగ వ్యాపించి యుండుటచేత వీనికి త్వగ్ వాహికలనియు పేరు. ఈ కాలువలగుండ వృక్షముయొక్క

1-జల్లెడ కాలువ నిలువున చూపబడినది. మూ.ప-కణముయొక్క మూల పదార్థము. స్వే-కోడి గుడ్డులోని శ్వేతధాతువు (Albumin) వంటి మాంసకృతుపదార్థము. రెండుకణముల మధ్యనుండు జల్లెడ రేకులోని రంధ్రముల చూడుము.

2-జల్లెడరేకు. దాని యందలి రంధ్రములు.

అనేకభాగములకు ఆకులయందు తయారుచేయబడిన పుష్టికరమగునత్రజనసంబంధమైన ఆహారరసములు వ్యాపించుచుండును.

దారువాహికలును, జల్లెడ కాలువలును మన శరీరము నందుండు రక్తవాహికల (Blood Vessels) వంటివి. ఇవి 40-వ పట