కడయపుచారలయొక్క అంచు లొకదానితో మరియొకటి జేరి మరచుట్టవలెనుండు నేకచార యేర్పడుచున్నది. 1, 3 వాహికలలోని చార లెవ్వియును చూపబడలేదు. (232-వ పుట చూడుము).
మనము సూక్ష్మదర్శనిలో జూచునప్పుడు కణకవచములమీద కనుబడు నిచ్చెనమెట్లు, మెలికలు, గుంటలు మొదలగు వివిధాకారములుగల చారలు మచ్చలు మొదలగున విట్టి దళసరియందలి మార్పులవలననే యేర్పడుచున్నవి. ఈరూపములు 35-వ పటములో జూపినప్రకారము దారువాహికల (Wood Vessels) యొక్క యుపరితలమున గానవచ్చు చుండుట మనము చూడగలము.
చారల రూపనిష్పత్తి.
పైని వివరించిన నాలుగురీతుల చారలును కడియములవంటి చారలనుండి పుట్టినవియే. ఏలయన, ప్రతికడియమును పూర్ణముగా కణముచుట్టును తిరిగియుండక, ఆకడియముల కొనలన్నియు నొకదానితో నొకటి యతుకుకొని పోయినయెడల నిచ్చెనమెట్లవంటి ఆకారముగల చారలు మరచుట్టు మెలికలవంటి ఆకారముగల నగును. ఇట్టిమరచుట్టు మెలికలవంటిచారలు కుడివైపునకు కొన్నియు, ఎడమవైపునకు కొన్నియు పోవుచు నవియన్నియు నొక దానితో నొకటి యలుముకొనియున్నచో వలయల్లికలవంటి యాకార మేర్పడును. ఈ చార లుండుచోట్లయందు దళసరి హెచ్చుచు వలకండ్లవలె నుండు మధ్యస్థలముల