ఈ పుట ఆమోదించబడ్డది
కొన్ని భాగములకుమాత్రము గలుగవచ్చును. ఈమా ర్పనేక విధములుగ నున్నది. కొన్నికణములందు వానికవచముయొక్క లోపలితట్టున కడియములవలెనుండుమిట్టలు వరుసగ నొక దానిపై నొకటి చారలుగ నేర్పడియుండును (34-వ పటములో A). కొన్నిటిలో నాచారలు మరచుట్లవలెనుండును (B) కొన్నిటిలో నీ చార లొండింటితో నలుముకొని వలయల్లికలవలె నుండవచ్చును. (C) మరికొన్నిటిలో నీమిట్టపల్లములు గుంటలుగుంటలుగ నుండును (D) ఈమార్పు లింక ననేకవిధములుగ గలుగవచ్చును.
1-4, దారువాహికలు:- 2 అను అంకె కెదురుగా నుండు వాహికలో కడియపుచారలు గలవు. 4 అంకె కెదుటనున్న వాహికలో మెలిచార గలదు.