4-బహుభుజకణములు. ఇవి మృదుకణముల సంహతులలో తరుచుగ నుండునవి.
5-బల్లపరుపుకణములు.
6-నక్షత్రాకారమైనకణములు.
7-పొడుగైనకణములు, దృఢకణముల సంహతులలో నీ కణము లుండును.
లగు అనేక కారణములచేత నవి కొన్ని గుండ్రముగను (Round),కొన్ని అండాకృతిగను (Oval), కొన్ని పొడుగుగను (Long), కొన్ని బహుభుజములుగను (Polygonal), కొన్ని గొట్టముల వలెను (Cylindrical), మరికొన్ని యిటికలవలె బల్లపరుపుగను (Flat), కొన్ని నక్షత్రములవలె చిత్రమైన యాకారములుగలవిగను ఉండవచ్చును.
2. కణకవచము దళస రెక్కుట.
ఇట్టి దళసరి కణకవచమున కంతటను ఏకరీతిగ గలుగవచ్చును. అట్లయిన చో కణకవచ మన్నిప్రక్కలను సమానముగా పెద్దదగుచుండును. ఒక కణము మిక్కిలి పొడుగుగ నెదిగి, దాని కణకవచము మిక్కిలి దళసరెక్కి మూలపదార్థము హరించిపోవు
టచే నారపోడు ఏర్పడుచున్నది. ఈ నారపోగు లధికమైనకొలదిని మ్రాకునకు జిగి హెచ్చును. లేక యిట్టి దళసరి కవచమునందలి