పుట:Jeevasastra Samgrahamu.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కణసముదాయము తప్ప విశేషనిర్మాణము లెవ్వియును లేవు. పుష్టికరములగు ద్రవాహారములు వాని మిక్కిలిపలుచని కణకవచములగుండ యొకకణమునుండి మరియొకకణమునకు ఊరి, నలుప్రక్కలను వ్యాపించుటచే ఆ కణములన్నిటికిని ఆహారము లభించును. కాని వీనికంటె పైతరగతి వృక్షములందు కణములకు కాఠిన్యము మొదలగు స్వభావములుండుటచే వాని యావరణపు పొరలుమిక్కిలి దళమైనవై పైజెప్పిన ద్రవాహారములను వానిగుండ వ్యాపించనియ్యవు. అట్లగుటచే ఆపనిని నెరవేచ్చుటకై ప్రత్యేక సేవకులని చెప్పనగు కొన్నికణములు సంహతులుగగూడి యొక్కొకసంహతి యొక్కొకవ్యాపారమునకు ప్రత్యేకముగ నేర్పడియుండును. గాలియందలి తమకు కావలసిన కర్బను (C) మొదలగు ఆహారపదార్థములను, ఆకులనుండి వృక్షశరీరమున కంతటికిని వ్యాపింపజేయునవి ఈ కణములే. వేళ్లనుండి నీటిని, లోహసంబంధమైన పదార్థములను ఆకులకు జేర్చు మార్గములుగా నేర్పడునవియు నీ కణములే. ఇట్లే కణములయం దనేకమార్పులు గలుగుచు అట్టి మార్పులవలన ఆయాకణములవ్యాపారములు నిర్ణీతము లగుచుండును. కణములయందలి మార్పులు వాని యావరణపుపొరలయందుగాని, వానియందలి మూలపదార్థమునందుగాని గలుగవచ్చును.

ఈ మార్పులు ముఖ్యముగా నైదువిధములు:

1. కణకవచము పెరుగుట.

2. కణకవచము దళసరెక్కుట.