లన్నియు నొక్కరీతిని వృద్ధిక్షయములనుబొందుచు, నొక్కొకగుం పొక్కొకవ్యాపారమున కేర్పడియుండి, ఆయావ్యాపారమును నెరవేర్చుటకుగాను ఆయాగుంపులలోని కణములు ప్రత్యేకనిర్మాణములు గలిగియుండును. ఇట్టిగుంపులకు కణసంహతులు (Tissues) అనిపేరు. నాచుమొక్కయందు వెలుపలివైపున నుండు దృఢకణము లొక సంహతిగా గూడి సంరక్షణ మొదలగువ్యాపారముల జేయుచున్నవి. మధ్యనుండు మృదుకణములు వేరొక సంహతిగా గూడి మొక్కయొక్క ఆహారద్రవముల వ్యాపకమును జేయుచున్నవి. ఇట్టి సంహతులభేదములను సూచించు వృక్షములలో నాచుమొక్క యే మొదటిది.
నిర్మాణభేదములబట్టి వ్యాపారభేదములు గలుగుట.
ఇట్లే ఒక్కొకతరగతి హెచ్చినకొలదిని, జంతువులకుగాని, వృక్షములకుగాని తమతమ వ్యాపారములయందు మార్పులు గలుగుచు, ఆయావ్యాపారములకు తగియుండునట్లు నిర్మాణమునందును భేదము పుట్టుచుండును. ఇందున కుదాహరణము:- నీటియందు ఎల్లప్పుడు నీదునట్టివ్యాపారము గలవగుటచేతనే కప్పలయొక్కయు, బాతులయొక్కయు వ్రేళ్ళమధ్య పలుచనిచర్మము లేర్పడి, యవి తెడ్లవలె పనిచేయుచుండును. ఇట్టిమార్పులు జంతువుయొక్కగాని, వృక్షముయొక్కగాని తరగతి హెచ్చినకొలదిని సంమిశ్రమగుచుండును. ఇది యొక చిన్నయుదాహరణమువలన చక్కగ తెలియగలదు. ఒక పల్లెటూరి మోటబండికి రెండు చక్రములు, చట్రము, పోలుగర్ర, కాడి - ఇవియే నిర్మాణమునందలి ముఖ్యాంగములు. దానినడక బైసికిల్ (Bicycle-