Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ కణములలో కొన్ని క్రింద మీరు చదువబోవురీతిని మార్పులు జెందును. కాని ప్రథమమున ప్రతివృక్షకణమును ఈ నిర్మాణమును కొంత కాలమువరకైనను గలిగియుండును. ఈపటములో జూపబడిన కణములకు, పెద్దపెద్ద చెట్లయందలి కణముల కెట్లో అట్లే సెల్లులూసుతో జేయబడిన స్పష్టమైన కణకవచము గలదు.

మూలపదార్థము.

జంతుకణములయొక్కయు వృక్షకణములయొక్కయు నిర్మాణములందలి, భెదములలో వృక్షముల చుట్టును సెల్లులూసుతో చేయబడిన స్పష్టమైన కవచముండుట యొక ముఖ్యమైన భేదము. కణకవచముయొక్క లోపలితట్టున జంతుకణములందువలెనే మూలపదార్థ మనబడు నొకానొక స్వచ్ఛమును వర్ణ రహితమునైన పదార్థము గలదు. ఇదియును వికారిణియందలి మూలపదార్థమును ఒకటియే. ఇది చూచుటకు లేత తాటిముంజె ముక్కవలె నుండునని చెప్పియున్నాము. ఇది ఉడికిన సగ్గుబియ్యమువలె మిలమిలలాడుచు జిగటజిగటగా నుండునని చెప్పవచ్చును. నీటికాయ (Jelly fish) వలె నుండునని ఇంగ్లీషుపుస్తకములలో వర్ణింపబడినది. వికారిణియొక్క మూలపదార్థముచుట్టును ఆవరణపు పొర అనగా కణకవచము లేదు. 1-వ పటమునందు వికారిణియొక్క మూలపదార్థపు సరిహద్దులు చూపుటకు కణముచుట్టు నొక నల్లనిగీటు గీయబడియున్నది. ఆ గీటు కణకవచము