Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

cation), శరీరనిర్మాణము (Morphology), ఇంద్రియ వ్యాపారములు (Organic functions) మొదలయిన విషయములను గుఱించి వ్రాయబడియుండును. మానవాస్థిపంజరశాస్త్రము (Human Anatomy) మానవశారీరశాస్త్రము (Human Physiology) అను రెండుశాస్త్రములును ఈ శాస్త్రము యొక్క విభాగములే. ఈ రెండు శాస్త్రములును వైద్యుల కత్యంతావశ్యకములు.

3. వృక్షశాస్త్రము:- మిక్కిలి చిన్ని వృక్షములు మొదలు గగనచుంబితములగు మహావృక్షములవఱకును గల వృక్షజాతుల వర్గీకరణము, శరీరనిర్మాణము మొదలయిన విషయములను గుఱించి యీ శాస్త్రమునందు వర్ణింపబడును.

4. మానసశాస్త్రము (Psychology) - ఇదియు జీవశాస్త్రాంతర్గతమే. ఇందు జిత్తవృత్తులను గుఱించియు, మనోధర్మములను గుఱించియు, మనోవ్యాపారములను గుఱించియు వివరింపబడి యుండును.

ఇవి సచేతనవిషయక మైన ముఖ్యశాస్త్రములు. ఇక నిర్జీవపదార్థములను గుఱించిన శాస్త్రముల గనుగొందము.

నిర్జీవవిషయక శాస్త్రములు.

1. పదార్థవిజ్ఞాన శాస్త్రము (Physics) - జీవశాస్త్రమువలెనేయిది స్వతంత్రశాస్త్రము కాదు. అనేక శాస్త్రముల సముదాయము. ఇందు జడము యొక్క సామాన్యధర్మము (General Properties) లను గుఱించియు, సృష్టిలోని శక్తి (Force) యొక్క రూపాంతరములగు ఉష్ణత (Heat), విద్యుత్ (Electricity), లోహ చుంబకత్వము (Magnetism), ప్రకాశము (వెలుతురు Light), ధ్వని (Sound) మొదలయినవాని గుఱించియు వర్ణింపబడును. ఇందలి గమనమును (Motion) గుఱించిన శాస్త్రమునకు గతిశాస్త్రమనయు (Dyanamics), వెలుతురును గుఱించినదానికి ప్రకాశ శాస్త్రమనియు (Optics) పేళ్లు గలవు. ఇందులోని ఇతరశాస్త్రములకు నిటులనే వేఱు పేళ్లు గలవు.