Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామాన్యముగా నట్టిపోలికలు దగ్గిరబంధువులలోనే యుండును. బంధుత్వము దూరమైనకొలదిని పోలికలును తగ్గుచుండును. మేనమామ దగ్గిరబంధువుడే గాన నాతనిపోలిక మేనల్లురకు గలుగుటయు గలదు. ఇట్లు పోలికలు గలుగుస్వభావమునకు వంశపారంపర్యము (Heredity) అని పేరు. కాని యీప్రకారము ఒక్కపోలిక గలఇద్దరికిని సర్వవిషయములయందును ఆపోలికలు సంపూర్ణముగ నుండినపక్షమున మనము వారలనిద్దరిని ఆనవాలేపట్ట లేము. అట్లు కించిత్తయినను భేదము లేకుండనుండుట యసాధ్యము. ఏవో కొన్ని భేదము లుండుచునే వచ్చు చుండును. మనలో నందరమును అనేకవేలమానవుల ముఖములను చూచియున్నాము. అందు ప్రతిరెండుముఖములకు ఎంతకొంచెమైనను భేదమున్నదిగాని లేకపోలేదు. అయినను అందులోకొందరియందు కొన్నిపోలికలు కానవచ్చును. ఎట్లన, పైనిజెప్పినప్రకారము అన్నదమ్ములు దగ్గిరబంధువులు గనుక వారిద్దరకు నొక్కపోలిక నుండవచ్చును. కాని మనము అన్నదమ్ములబిడ్డలను పోల్చిచూచిన వారిలో కొంచెముపోలిక యుండినను ఉండవచ్చును గాని అన్నదమ్ముల కున్నంతపోలిక యుండదు. వారిలో నొకరినుండి మరియొకరిని భేదపరిచెడు చిహ్నములకు నై సర్గికవ్యత్యాసము (Natural Variation) అని పేరు. అనగా సృష్టిచే నేర్పరుపబడిన పరస్పరభేదములు. ఇట్లే మనము తాతాసహోదరులలో ననగా, తమ తాతలు సహోదరులుగా గలవారిని పరీక్షించినయెడల అంతమాత్రమును పోలిక యుండదు. ఈ వంశవృక్షమనుచెట్టునందు ఆదిపురుషుడనదగిన మొదలునుండి దూరపు