మార్గ మేర్పడును. ఈ రంధ్రమునకు సూక్ష్మరంధ్ర మని పేరు (28-వ పటములో B-లో సూ).
స్త్రీపురుషబీజములజీవస్థానము లైక్యమగుట.
ఇంతలో సూక్ష్మబీజాశయములోని మధ్యకణము లనేక కణములుగ చీలి యందు ప్రతి చిన్న కణము నొక సూక్ష్మబీజమగును. అంతట నా సూక్ష్మబీజాశయము పగిలి సూక్ష్మబీజములు నీటిలోనికి చెదరి తమ పొడుగైన తోకల సహాయముచే నీదులాడుచు స్థూలబీజమునిమిత్తమై వెదకుచు బోవుచుండును. అం దొకటి చిట్టచివరకు స్థూలబీజమును జేరి సూక్ష్మరంధ్రముగుండ దాని మూలపదార్థములో ప్రవేశించును (28-వ పటములో B-లో సూ). సూక్ష్మబీజముయొక్క జీవస్థానము మెల్ల మెల్లగ స్థూలబీజముయొక్క జీవస్థానమును జేరును. C-లో స్థూ. జీ, సూ. జీ, లు వరుసగ స్థూలసూక్ష్మబీజముల జీవస్థానములు. ఇప్పు డీ స్థూలబీజములో ఆకర్షణబింబములు రెండు గలవు (C-చూడుము). అం దొకటి స్త్రీబీజసంబంధమైనది. రెండవది పురుషబీజసంబంధమైనది క్రమముగా నీ స్థూలసూక్ష్మబీజముల జీవస్థానములు మిశ్రమై యేక జీవస్థాన మగును (28-వ పటములో D. E. చూడుము). స్థూలబీజముయొక్క జీవస్థానము సూక్ష్మబీజముయొక్క జీవస్థానముతో నైక్యమగుటయే ఫలించుట (Fertilisation).
సంయుక్తబీజము. ఏకకణపిండము.
ఇట్లు స్త్రీపురుషబీజముల సంయోగముచే నేర్పడినసంయుక్తబీజము తనచుట్టును దళమైన గూడువంటి పొర నొక దానిని