B. ధ్ర. 1, 2-ప్రథమ, ద్వితీయ ధ్రువరేణువులు. ఇవి రెండును విసర్జింప బడినతరువాత కణకవచమునందు సూక్ష్మరంధ్రమను (సూ) నొక పగులు పుట్టినది. తమపొడుగైన తోకలవంటి మృదురోమముల సహాయము చే చుట్టుప్రక్కల నీదులాడుచుండు, సూక్ష్మబీజము లాపగులుగుండ కణములోనికి ప్రవేశింప బోవుచున్నవి.
C. స్థూలబీజముయొక్క మూలపదార్థములో దాని జీవస్థానమును (స్థూ. జీ.) సూక్ష్మబీజముయొక్క జీవస్థానమును (సూ. జీ.) రెండునుగలవు. వీని రెంటియొక్క ఆకర్షణబింబములుగూడ చూపబడినవి.
D. స్థూలసూక్ష్మబీజముల జీవస్థానములు మిశ్రమ మగుచున్నవి.
E. ఫలించిన సంయుక్తబీజము.
సూక్ష్మరంధ్రము.
పైని జెప్పబడిన రెండు ధ్రువరేణువులును ఖండింపబడగా కణములో మిగిలిన జీవస్థానము మొదటనున్న జీవస్థానములో నాలుగవవంతుమాత్ర ముండును. ఈ ధ్రువ రేణువులు తల్లి హైడ్రాయొక్క సంతతియందలి పురుషసంబంధమైన పదార్థమనియు, నాపదార్థము స్త్రీ బీజము పురుషబీజముతో సంయోగమగుటకు పూర్వము వెలువరింపబడుననియు, పక్వమైన స్థూలబీజమునందు మిగిలిన జీవస్థానపదార్థమంతయు హైడ్రాయొక్క స్త్రీసంబంధమైన పదార్థమే యనియు కొందరు నిర్ధారణ చేసియున్నారు. ఈ తరుణమున స్థూలబీజము పైని కప్పియుండు ఆవరణపుపొరలో చిన్న రంధ్రము పుట్టి యారంధ్రముగుండ వెలుపలనుండు నీటికిని, స్థూలబీజమునందలి మూలపదార్థమునకును