పుట:Jeevasastra Samgrahamu.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధ్రువ రేణువు (First Polar Body) అనియు, రెండవసారి వెలువరింపబడిన ముక్కకు ద్వితీయ ధ్రువ రేణువనియు పేరు (28-వ పటములో A.B.లలో ధ్ర. 1,2. చూడుము). స్థూలబీజము యొక్క జీవస్థానపు సమీపమున ఆకర్షణబింబము (Attraction Sphere) అను పేరుగలచుక్క యొకటి గలదు. (28-వ పటములో A-లో ఆ.బి). ఇది ప్రతికణమునందును జీవస్థానముప్రక్క నెల్లప్పుడు నుండుననియు, అది జీవస్థానము విభాగమగునప్పుడు స్పష్టముగా కనుబడుననియు కనిపెట్టబడినది. ఈఆకర్షణబింబమే కణముయొక్క విభాగక్రియను నడపునది యని నిశ్చయించియున్నారు.

అథూలబీజము సూక్ష్మబీజముతో గలసి సంయుక్తబీజ మేర్పడువరకు గలిగెడు, వివిధావస్థలు

A - స్థూలబీజముయొక్క జీవస్థానడు కణకవచముయొద్దకు బోయి ప్రథమ ధ్రువరేణువును (ధ్ర) 1. విసర్జించుచున్నది. ఆ. బి-ఆకర్షణబింబము.