నలువైపులను వ్యాపింపజేయుటకు మనశరీరమునందుండు నెత్తురు కాలువల బోలిన కాలువ లెవ్వియు నిందు లేవు. దీనియందలి కణము లొకదాని కొకటి దూరముగ నుండినచో నొకకణము నుండి మరియొకకణమునకు ఆహారద్రవములను వ్యాపింపజేయుటకు పై జెప్పినకాలువ లుండవలసినయవసర మేర్పడును. అట్లుగాక హైడ్రాయందలికణము లొకదానినొకటి జేరియుండుటచే దాని యాహారరస మొకకణమునుండి మరియొకకణములోనికి ఆకణముల పలుచని కవచములగుండ సులభముగ నూరుచుండును. మనవలె నీజంతువునకు శ్వాసకోశములు (Lungs) లేవు. అంతటి చిన్న జంతువునందు దాదాపుగా నన్ని కణములును నీటితో సంబంధము గలవిగా నున్న వగుటచే నవి యానీటియందు లీనమైయుండు ప్రాణవాయువును తీసికొనుటయు, తిరిగి యానీటిలోనికి బొగ్గుపులుసుగాలిని వెడలబుచ్చుటయునగు శ్వాససంబంధమైన వ్యాపారములను సులభముగా జరుపుచుండును. అందుచే నీ హైడ్రాకు శ్వాసకోశములు లేవనులోపము లేదు. కాని అనవసరమైన పదార్థముల విసర్జించునట్టి అవయవములగు ఆసనము మూత్రాశయములు మొదలగునవి హైడ్రాయందు ప్రత్యేకముగా లేక పోవుటమాత్రము కొంచెము చిత్రముగా నున్నది. మిక్కిలి క్రిందితరగతిలోనిదగు వికారిణియందు సహితము సంకోచనావకాశ మిందునిమిత్తమై యేర్పడియున్నది. బహుశ: జీర్ణ రసమును తయారుచేయు అంతశ్చర్మమునందలి గ్రంథికణములే శరీరమునందలి వ్యర్థపదార్థముల విసర్జనముగూడ జేయునని యూహింప దగియున్నది.
పుట:Jeevasastra Samgrahamu.pdf/241
Appearance