యొకటి గలదు. దాని శరీర కాంతినిబట్టియే దాని కా పేరు గలిగినది. దాని యంతశ్చర్మకణములలో నక్కడక్కడ హరితకము లుండును. బహిశ్చర్మకణములు స్వచ్ఛమై వర్ణ రహితమైన వగుటచేత హైడ్రాయంతయు ఆకుపచ్చగ గనుబడును. ఈ హరితకములు వృక్షకణములయం దుండునట్టివియేగాని వేరుగావు. కాన నిట్టి హైడ్రాయొక్క యాహారము కొంతవరకు వృక్షాహారమని తెలిసికొననగును. కాన సూర్య కాంతిసహాయముచే హరితకముల మూలమున బొగ్గుపులుసుగాలినుండికూడ హైడ్రా తనయాహారమును సంపాదించుకొనును.
శ్రమవిభాగము.
మొత్తముమీద జూడగా బహిశ్చర్మకణములు ముఖ్యముగా సంరక్షణపుపని చేయునని యనియును, స్పర్శజ్ఞానము, చలన జ్ఞానము మొదలగు నాడీసంబంధమైన వ్యాపారములుగూడ వీనికి గలవనియును తెలియగలదు. అంతశ్చర్మకణములు ఆహారమును జీర్ణముచేయు వ్యాపారము గలవి. అక్కడక్కడ రెండింటియందును హైడ్రాకు కావలసిన జిగురు మొదలగు పదార్థములను స్రవింపజేయు గ్రంథికణములు గలవు. రెంటికిని మాంసాంకురము లుండుటచే కండయొక్క స్వభావము అనగా సంకోచవికాసములు కొంతవరకు గలవు. హైడ్రాను నిలువుగ నిలువబెట్టుటయందు సహాయపడు నడిమిపొరయే మన అస్థిపంజరము (Skeleton) యొక్క ప్రథమరూపమని యూహింపదగియున్నది. హైడ్రాయొక్క ఆహారమునుండి తయారుచేయబడిన శరీరపోషక ద్రవములను