నొకప్పు డొక్కకణమునందలి మీటునకు గలిగిన కొద్దిపాటి స్పర్శముచేతనే హైడ్రాయొక్క యనేక కణములయందలి తంతితిత్తుల నుండు తంతువులన్నియు ఒరదూసిన కత్తులవలె నిగిడియుండును. ఇట్లొక్కచో గలిగిన కొద్దిమాత్రపు తాకుడువలన హైడ్రా అమితముగా పనిచేయుచున్నది. ఒకానొకప్పుడు తనకంటె గొప్పజంతువుల యలుకుడుచే భయపడినప్పుడు హైడ్రా మిక్కిలి చిన్న రూపమును వహించి దాగికొనునట్లుగా ముడుచుకొనియుండును. ఈప్రకార మొక్కచో గలిగిన జ్ఞానమును శరీరమునం దంతటును వ్యాపింపజేసెడు నాడీమండలము (Nervous System) ఈ హైడ్రాయం దుండియుండవలెను. మనవలె నీ హైడ్రాకు మెదడు లేదు (Brain). కాని నాడీకణముల (Nerve Cells) వంటి బహుధ్రువకణములు (Multipolar Cells) అక్కడక్కడ దాని శరీరమునందు చిమ్మబడియున్నట్టు కనిపెట్టబడినది. హెచ్చుతరగతి జంతువులలోవలె నాడీమండల మేర్పాటుగ నిర్మింపబడి యుండనప్పటికిని, ఏదోయొకరీతిని నాడీజ్ఞానముయొక్క ప్రథమాంగములు (Rudiments) హైడ్రాయందు గలవని స్పష్టపడుచున్నది.
గ్రంథికణములు (Gland Cells)
బహిశ్చర్మకణములలో పీఠము (పీ) నం దుండువానియందలి మూలపదార్థమునందు పెక్కుఅణువు లుండును. ఈకణముల నుండి యొకానొకవిధమైన జిగురుపదార్థము స్రవించుచుండును. ఈజిగురుపదార్థముయొక్క సహాయముచేతనే హైడ్రా స్థిరముగ పీఠముతట్టు నితరపదార్థముల నంటుకొనియుండును. ఇట్లు స్రవించు