ప్పుడు నొక విషపదార్థము స్రవించుచుండును. మిక్కిలి వేగమున అటునిటు పరుగులెత్తు చుండుజంతువు లీ విషముయొక్క స్పర్శమాత్రముననే జడములగును. ఇట్టి తంతితిత్తులు మీసముల కొనలయందు మిక్కిలి దట్టముగ నమరియుండును. కావుననే తనస్థానమును విడచి కదలలేనిదయ్యును హైడ్రా తనకంటె పెద్దవియును, హెచ్చుజాతివియు నగు జీవజంతువులసహితము పట్టి తినును.
నాడీమండలము.
పైని జెప్పిన తంతితిత్తుల వ్యాపారమును మనము గ్రహించితిమేని వీని వ్యాపారముల నడపించు బహిశ్చర్మ కణములకు చలన, స్పర్శనాడుల (Motar & Sensory Nerves) స్వభావములు రెండును గలవని తెలిసికొన గలుగుదుము. నాడి యనగా నరము. నరములు శరీరమునందలి యొక భాగమునుండి మరియొక భాగమునకు సమాచారముల తెలుపు తీగలవంటివి. పైని వివరించిన ప్రకారము నీటిలో నిగిడియుండు బాణపు అలుగువంటిభాగము స్పర్శనాడియొక్క కొనవంటిది (Sensory Nerve ending). దీని నేదైననొక పదార్థము స్పృశించుతోడనే కణమున కాతాకుడుయొక్క జ్ఞానము వ్యాపించును. అంతట నాకణము అంతకుపూర్వమే ముందుకురుకుటకు సిద్ధముగనున్న తంతితిత్తులోని తీగెకు "తయార్" అని ఆజ్ఞ యిచ్చును. అప్పు డా తిత్తులయందు నిలువ జేయబడి యున్నశక్తి (Potential energy) యొక్కసారిగా బయలువెడలి తంతితిత్తులయొక్క తంతువులకు చాక చక్యము గలిగించును. ఒకా