మాంసాంకురములన్నియు పొట్టివగుచు వానితోపాటు శరీరము నంతను క్రిందికి నీడ్చును. ఆవర్తకారియందలి నడిమిపోగును, ఈ హైడ్రాయందలి మాంసాంకురములును నొక్కటే స్వభావముగలవని గ్రహింపనగు.
బహిశ్చర్మకణములకు ప్రేరితసంకోచనము (Irritability) స్వేచ్ఛాసంకోచనము (Automatism) రెండును గలవు. అందు ప్రేరితసంకోచనము అనగా బాహ్యపదార్థముల స్పర్శముచే ప్రేరేపింపబడి సంకోచించుస్వభావము. అది కణముల వెలుపలిభాగములయందు హెచ్చుగనుండును. స్వేచ్ఛాసంకోచనము అనగా హైడ్రా యిచ్చవచ్చినప్పుడు సంకోచించు స్వభావము. ఇది మాంసాంకురములయందు హెచ్చుగనుండును.
తంతితిత్తులు.
పెద్ద బహిశ్చర్మకణములలో కొన్నిటియందు అండాకృతిగల నిర్మలమైన తిత్తి యొకటి కనుబడును (27-వ పటములో D-లో తం). ఈతిత్తియొక్క యావరణపుపొర స్పష్టముగ తెలియుచుండును. ఈతిత్తుల నోటినుండి పటములో క్రిందిభాగమున E-లో జూపినప్రకారము పొడుగును, సన్నమును, మెత్తనయు, కోమలము నైన తీగెవంటి గొట్ట మొకటి వ్యాపించియుండును. ఈ తిత్తులకు తంతితిత్తు లని పేరు. వీనిని సూక్ష్మదర్శనితో శ్రద్ధగ పరీక్షించినయెడల వీని నిర్మాణ మీ దిగువరీతిగ నున్నట్టు తెలియ గలదు. ఈ తిత్తి యొక రబ్బరుకాలిబంతి (Foot-ball) వలె నున్నదని యూహింపుము. దానిలోనికి గాలి జొప్పించుట కుపయో