పుట:Jeevasastra Samgrahamu.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కణములు ఉలివలె (Wedge Shaped) చివర సన్నముగను, మొదట దళముగ నుండును (బ). దళమగు మొదలు వెలుపలివైపునకును, సన్నముగ నుండు కొనలు లోపలి తట్టునకును అమర్పబడి యుండును. ఇట్లు పేర్చబడుటచే ఆదోకగ నుండు లోపలి కొనల మధ్య నెడములు మిగులక మానవు. ఈ యెడములందు రెండవ విధమైన కణము లిమిడియుండును (మ.క). ఇవి గుండ్రని చిన్న చిన్న కణములు. ఇవి అవసరమునుబట్టి పెద్దకణములుగా మారుచుండును. వీనికి మధ్యకణము (Interstitial Cells) లని పేరు.

పెద్ద బహిశ్చర్మకణములలో ననేకకణములు లోపలితట్టున పొడుగుగా సాగి యాకొనయందు మొనతీరి (Pointed) యుండును. ఇట్లు మొనతీరియుండు కొనలన్నియు కణమునకు సమకోణముగ (At Right Angles) వంగియుండును. అనగా ఇవి హైడ్రా యొక్క పొడుగునకు సమాంతరము (Parallel) గ నుండును. ఇట్లు వంగిన భాగములకు మాంసాంకురము లనిపేరు. ఈ మాంసాకురములన్నియు జేరి నడిమి జిగటపొరకు వెలుపలివైపున నొక పొరగా హైడ్రా పొడుగున నంతటను వ్యాపించియుండును. ఈ మాంసాకురములు హెచ్చుతరగతి జంతువుల కండలయొక్క (Muscles) స్వభావము గలవి. అనగా సంకోచవికాసములు గలవి. ఇవియన్నియు నేకమై సంకోచించుటచేతనే దీని శరీరము ముడుచుకొనుచున్నది. ఇవి యన్నియు నేకమై వికసించుటచేత దీని శరీరము పొడవగుచున్నది మన మీహైడ్రా నొకపుల్లతో తాకిన యెడల నది తటాలున ముడుచుకొని చిన్నదగును. అట్టిస్థితిలో