పుట:Jeevasastra Samgrahamu.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

C. హైడ్రాను నిలువున చీరగా నేర్పడిన చీరిక. బ-బహిశ్చర్మము. అం-అంతశ్చర్మము. న.పొ-నడిమిపొర. పీ-పీఠము. మీ-మీసము. నో-నోరు. క్రీ-క్రీవాయి. పి-పిల్లహైడ్రాలు మొటిమలుగా పుట్టుచున్నవి. సూ.బీ-సూక్ష్మబీజాశయము. స్థూ.బీ-స్థూలబీజాశయము.

D. క్రిందిభాగమున హైడ్రాయందలి చిన్న తునక యొకటి మిక్కిలి పెద్దదిగ కనబరచబడినది. కుడివైపున బహిశ్చర్మకణములు (బ). ఎడమవైపున అంతశ్చర్మకణములు (అం). ఈ రెంటిమధ్య (న.పొ) నడిమిపొర. కం-మాంసాంకురములు. మ.క-మధ్యకణములు. తం-తంతితిత్తి. మీ-మీటు. దీని కెట్టిదైనను తాకుడు గలుగగనే తంతితిత్తినుండి పొడుగైన తీగె యొకటి క్రిందిభాగమున E-లో ప్రత్యేకముగ జూపబడినట్లు నిగిడింపబడును. అంతశ్చర్మకణములలో కొన్నిటియొక్కకొనలు వికారిణి యొక్క (పా) పాదములవలె మొండిగను, మరికొన్నిటికొనలు పొడుగైన (మృ). మృదురోమములవలె తోకలుగను ఉన్నవి.

నున్నట్టును తెలిసికొననగును. మీసములుగూడ బోలుగనేయుండి వానియందలి బెజ్జములుకూడ జీర్ణాశయబిలముతో జేరి యుండును.

ఒక వాచిఅద్దము (Watchglass) లో కొంచెము నీళ్లు పోసి అందులో నెమ్మదిగా కొంచెము తుక్కుతోపాటు ఒక హైడ్రాను ఉంచి దాని నంతటంతట సూక్ష్మదర్శనితో పరీక్షించుచు వచ్చినయెడల దాని నడవడి, ఆహారపద్ధతి, మొదలుగాగల యనేక విషయముల దెలిసికొననగును. ఒకానొకప్పుడు 27-వ పటములో A-లో జూపినప్రకారము హైడ్రా తన వెడల్పుకంటె 15 రెట్లు పొడుగుగలదిగా విస్తరించియుండును. దీని మీసములు మిక్కిలి సన్నని మృదువైన పోగులవలె నుండును. మరియొ