పుట:Jeevasastra Samgrahamu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదలు మూడునూళ్లవరకు అనగా, అంగుళములో పండ్రెండవవంతు మొదలు నాల్గవవంతువరకు పొడుగును గలిగి తెల్లగగాని కొంచె మాకుపచ్చగగాని యుండు సముదాయములు (Masses) గ గనిపించును. ఇవి తమ మొదటిభాగములచే పై జెప్పిన తుక్కు మొదలగువానికి గట్టిగ అంటుకొన్నవై యుండును.

సూక్ష్మ నిర్మాణము.

సూక్ష్మదర్శనియొక్క తగ్గు దృక్ఛక్తితో పరీక్షించిన దాని నిర్మాణమునందలి అంశములు తెలియగలవు. సూక్ష్మదర్శనిలో దీనిమొండెము గొట్టమువలె కనబడును. ఆ మొండెముయొక్క పీఠమువలె నుండెడు చదునైన మొదటిభాగము ఇతరవస్తువుల నంటియుండి వానినుండి మొలచునట్లుగా కనిపించును (27-వ పటములో A-చూడుము). దాని రెండవకొన ఆదోకగ (Cone) నుండి శిఖరమున గుండ్రనిరంధ్రమును గలిగియుండును. ఈ రంధ్రమే దానినోరు (నో). ఈ నోటికి క్రిందివైపున ఆదోకగా నుండుభాగమునకు క్రీవాయి (Hypostome) యని పేరు (క్రీ). ఈ క్రీవాయి మొండెముతో గలియుచోట 6 మొదలు 8 వరకు సంఖ్యగల పొడుగైన మృదువగు మీసములు (Tentacles) కిరణములవలె క్రీవాయిచుట్టును వెడలియుండును (27-వ పటములో మీ. చూడుము). మొండెమును నిలువున ఖండించిచూడగా నది బోలుగా నున్నట్టును, అందు జీర్ణాశయ మను పెద్దయవకాశము పొడుగునను వ్యాపించి యున్నట్టును, ఆ యవకాశము దాని నోటిరంధ్రమార్గమున చుట్టునుండు నీటితో సంబంధముగలదిగ