కాన నివి పరాన్నభోజులలోనివి. వీనికి నోరు లేదు. వీని యాహారము వీని పలుచని కణకవచముగుండ ఊరి, లోపలికి వ్యాపించుచుండును.
ఏకకణప్రాణుల తరువాత కణములయొక్క ఘనసము అవయములు గానవచ్చు చున్ంవి. అట్టివానిలో మొదటిదనిచెప్ప దగినదియు, సులభముగా గ్రహింపదహినదియు నగు హైడ్రాయను నీటిపురుగును గూర్చి వ్రాసెదము. దీనికిని వృక్షజాతి జీవులకును గలభేదము చక్కగ గ్రహింపనగును.
హైడ్రాయొక్క నివాసస్థానము
హైడ్రా యను నీటిపురుగు కొంచెము అపరిశుద్ధమైన మంచినీళ్ల గుంటలందు సామాన్యముగ నుండునట్టి దైనప్పటికిని ఎన్నడు నమితముగా నుండకపోవుటచేత కొంచెము శ్రద్ధజేసి వెదకినగాని కానరాదు. దీనిని పరీక్షించునిమిత్తమై యొక-స్వచ్ఛమైన గాజుగ్లాసును అట్టి గుంటయందలి నీటితో కొంత తుక్కు సహితము నింపుము. దీనిని కొన్ని నిమిషములవరకు కదపకుండ నొకచోట బెట్టుము. తగినన్ని హైడ్రా లానీటిలో నున్నయెడల, అవి యాగ్లాసుయొక్క ప్రక్కలనుగాని దానియందలి తుక్కును గాని యంటి, సన్నని నూలుపోగులంత లావును, ఒక నూలు