పుట:Jeevasastra Samgrahamu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునొకండవ ప్రకరణము.

హైడ్రా (Hydra).

వృక్షజాతిలో మొట్టమొదట కొన్ని సూక్ష్మజీవులు మొదలగు ఏకకణప్రాణులను, తరువాత అనేకకణముల పంక్తులగు బూజుపోగు, పసిరికపోగు మొదలగువానిని, పిమ్మట అనేకకణముల చదరపుపేరుపు అగు ఏక పత్రమును, తదనంతరము కణముల ఘన సమూహమగు వారిపర్ణి, నాచు, మొదలగు పై తరగతులను క్రమముగ నొకదానికంటె మరియొకటి సంమిశ్రమైనవై (Complex) నిర్మాణవి శేషతయందు హెచ్చుచుండుట చూచియుంటిమి.

కాని జంతుజాతిప్రాణులలో వికారిణి, ఆవర్త కారి మొదలగు ఏకకణప్రాణులనుమాత్రము జూచియున్నాము. ఏకకణ జంతువుల వర్ణన ముగించినతోడనే, పసిరికపోగుతో సమాన తరగతిలో జేర్చదగిన కణములపంక్తులగు జంతువులు గానరావు. అయినను, ఏకకణమునందే యనేకజీవస్థానములుగల ఆంత్రకములు (Opalina) మొదలగు జంతుజాతిలోని ప్రాణు లనేకములు గలవు (26-వ పటము చూడుము). ఆంత్రకములు కప్ప మొదలగు జంతువుల పేగులలో నివసించుచు వాని జీర్ణ రసములచే జీర్ణముచేయబడిన ఆహారము పీల్చును బ్రతుకుచుండును.