పుట:Jeevasastra Samgrahamu.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టుచే ఆకులయందలి కణములును సుఖించుచుండును. ఒండొరుల సహాయములేక నెద్దియును జీవింపజాలదు. ఇట్లు తమతమపనులను తమలోతమకు కష్టములేకుండునట్లు తమతమస్థానముల ననుసరించియు, స్థితిగతుల ననుసరించియు, పంచికొనుటయే శ్రమవిభాగము. ఈ శ్రమవిభాగమును చక్కగా గ్రహించుటకు జనసంఘముల నడవడికల చరిత్రములనుండి యుక్తమైన యుదా హరణములు గలవని యిదివరలో జెప్పియుంటిమి. ఒక గొప్పవాని సహాయములేక చాకలి మంగలి మొదలగు సేవకులు ఎట్లు జీవింపలేరో అట్లే చాకలివాని సహాయము లేక గొప్పవాడును అనుకూలముగా జీవించుట కష్టము. తమతమ చేతనైన పనులు చేయుచు ఒకరికొకరు సహాయులుగా నున్నయెడల ఇరువురకు అనుకూలముగానుండును. ఇట్లే రాజుయొక్క సహాయము లేక ప్రజలకుగాని, ప్రజలయొక్క విరోధమును సంపాదించుకొనిన రాజునకుగాని సుఖము గలుగ నేరదు. ఈశ్రమవిభాగసూత్రము అల్పప్రాణులగు నాచుమొక్కల కెట్లో హెచ్చుజాతిజీవులకు బోల్చదగిన జనసంఘములకును రాష్ట్రములకు నట్లే వర్తించునని గ్రహింపనగును.