యందట్లుగాదు. దీనియందలి వేర్వేరుభాగములయందుండు కణము స్థితిగతులు వేర్వేరుగా నున్నవి. దీనిమూలతంతువులు చెరువు అడుగుననున్న బురదలో నాటుకొనియుండును గాన నవి వెలుతురునకు దూరమైనవిగా నుండుటచేత వీనికణములయందు హరితకముల యుపయోగము లేదు. కాన బొగ్గుపులుసుగాలిని (CO2) వేళ్ళయందలికణములు విభజింపనేరవు. కాని యివి ఎల్లప్పుడును తడిమట్టిలో పాతుకొనియుండుటచేత లోహపదార్థసహితమైన నీటిని తమలో నిముడ్చుకొనుటకు తగినస్థితిలో నున్నవి. కొంచెము దృఢముగ నుండునట్లు నిర్మింపబడిన కాండములు మొక్క నిలువ బడుటకు ఊతముగా నుండుటకై ముఖ్యముగా నేర్పడియున్నవి. వీనియందలి వెలుపలికణములు దళసరిగా నుండుట చేత నీటినిగాని ఆహారపదార్థములనుగాని చొరనియ్యవు. వీనియందును హరితకములు లేవు.
కాబట్టియే బొగ్గుపులుసుగాలిని (CO2) విడదీయు పని ఆకులకుమాత్రమే నియమించబడినది. సామాన్యముగా భూమిమీద నివసించు మొక్కవలెనే నాచుమొక్కయు తనకు కావలసిన కర్బను (C) నొకభాగమునందును అనగా ఆకులయందును, నీరు, నత్రజనము (N), గంధకము (S), పొటాసియము (K) వీనిని మరియొక భాగమునందును అనగా వేళ్లయందును ఇముడ్చుకొనును. మొక్కయొక్క ప్రతిభాగమునకు ఈ పదార్థములన్నియు కావలసియున్నందున చిట్టచివరనుండు ఆకులయందుండు కర్బను అడుగుననుండు వేళ్లకును, కర్బను గాక యితర