అనగా మొదటి నాచుమొక్కకు రెండవనాచుమొక్క పౌత్రసమానమని గ్రహింపనగును. ఈరెంటికి మధ్యనుండు అనేకకణపిండము మొదటిమొక్కకు బిడ్డయును రెండవమొక్కకు తల్లియునుగా నెన్నదగును. ఇట్లు రెండేసితరములకొక సారి నాచుమొక్కయు నాచుమొక్కకు నాచుమొక్కకుమధ్య నొకతరము పిండములును వరుసగా పుట్టుచుండును. ఈప్రకారము తరమువిడచి తరమున ఒక్కొకతరహాప్రాణి పుట్టునట్లు మార్పులనొందు జన్మమునకు జన్మగర్భితజన్మము అనిపేరు. ఇట్లే వారిపర్ణికి పూర్వవారిపర్ణియు, పూర్వవారిపర్ణికి వారిపర్ణియు పుత్రస్థానముగ నున్నవి. పై వారిపర్ణినుండి జన్మించు క్రిందివారిపర్ణి పైదానికి పౌత్రసమానము అనగా మనుమనివంటిది.
నాచుకణముయొక్క యాహారము.
ఇది కేవల క్షృక్షాహారము. కణములయొక్క స్థితిగతులను బట్టి ఆయాకణములవ్యాపార వ్యత్యాసములు స్పష్టముగ నేర్పడుచున్నవి. ఇట్టి స్థితిగతులను కొన్నిటి నాలోచించుదము. వారిపర్ణిలో (Chara) ఆకులన్నియు నీటిలో మునిగియుండును. దీని కణములన్నిటియందును హరితకము లుండును. ఇం దన్ని భాగముల యందుండెడు కణములలో ప్రతికణము నితరకణములతో నిమిత్తము లేకుండ బొగ్గుపులుసుగాలిని (CO2) విడదీయుటయు, ఇతర యాహారపదార్థములను నీటినుండి తీసికొనుటయు మున్నగువ్యాపారముల నన్నిటిని స్వతంత్రముగ జేసికొనును. ఇందు ప్రతికణము నితరకణముల సహాయము లేకయే జీవించగలదు. నాచుమొక్క