Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సిద్ధబీజము (Spores)లగును. ఈ సిద్ధబీజములు ముదిరినతరువాత సిద్ధబీజాశయము పగిలి యందలి సిద్ధబీజము లన్నియు చెదరిపోవును.

ప్రథమతంతువు.

ఈ సిద్ధబీజమునుండి మొలక యంకురించునప్పుడు 25-వ పటములో A-లో జూపినప్రకారము దానియొక్క వెలుపలి కవచమునం దొక చోట పగులు పుట్టును. ఆ పగులుగుండ లోపలికణ కవచముచే నావరింపబడిన మూలపదార్థము ప్రాకి పొడుగైన తంతువుగా పెరుగును. దీనికి ప్రథమతంతువని పేరు. ఈతంతువునం దడ్డముగ నేర్పడు పొరలచే నిది యనేకకణముల పంక్తిగా విభజింపబడును. ఇట్టిస్థితిలో నిది బూజుపోగును బోలియుండును. దీనికి శాఖ లనేకములు పుట్టి యా పోగులన్నియు చిక్కగ నలుముకొని యల్లికగా నుండును. కొంతకాల