Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతి చెరువునకు నలంకారముగా నిత్యము పచ్చగనుండు నాచు మనమందర మెరిగినదియే. ఇం దనేకజాతులు గలవుగాని యీక్రింద వ్రాయబోవు వర్ణన సామాన్యముగా నన్నిటికిని జెందును.

నిర్మాణము.

నాచుమొక్కయం దొక ప్రకాండము (Primary Stem) గలదు. దానినుండి క్రిందికి వేళ్లును, పైనీటిలోనికి దట్టముగా నొకదానిపై నొకటిగా వెడలు ఆకులును అక్కడక్కడ నుపకాండములును (Secondary Stems) గలుగుచుండును (21-వ పటములో A-చూడుము). కాండమునందలి ఆకులు పుట్టుభాగమునకు స్కంధశిరమనియు, రెండు స్కంధశిరములకు మధ్యనుండు భాగమునకు స్కంధమనియు, నొక స్కంధమును స్కంధశిరమును గలిసిన భాగమునకు ఖండమనియు పేరు. కొమ్మయొక్క కొనయందు లేతయాకులు గుంపుగా కూడి యొకదానిపై నొకటి మొగ్గయొక్క రేకులవలె వంపునొంది కొనమొగ్గ యగును.

దీనికొమ్మ అస్వచ్ఛముగ నుండి వెలుతురు చొరనియ్యని దగుటచేత మిక్కిలి పలుచనైనపొరలుగా కోసి యాపొరల సూక్ష్మదర్శనిలో పరీక్షించినగాని దాని నిర్మాణము తేటపడదు. అట్లు పరీక్షించునప్పుడు మిక్కిలి చక్కగా నొకదానిప్రక్క నొకటిగా నమర్పబడిన కణముయొక్క ఘనసముదాయముగా నీ పొరలు గనబడును. కాని యీ కణములన్నియు నొకదాని నొకటి