అనేకములైన హరితకములు గలవు. ఈ హరితకములు లోపలి అంచుననుండి పై యంచంతయు స్వచ్ఛముగా నుండుటచేత నీసూక్ష్మబీజాశయము, సరిగా సరిపోయిన గాజుకుప్పెలో కూర్చిన నారింజపండువలె కనిపించును. ఈ బద్దయొక్క లోపలితట్టున, మధ్యభాగమున నొక గొట్టమువంటి కణము పిడివలె (Handle) సూక్ష్మబీజాశయముయొక్క గోడనుండి, మధ్యవైపునకు వ్యాపించియుండును (20-వ పటములో A. B. లలో పి. చూడుము). ఈ పిడియందును నారింజరంగుగల హరితకము లుండును. ఇట్టి పిళ్ళ ఎనిమిదింటిని ఎనిమిది తలకణము (Head Cells) లుండును (20-వ పటములో A. B. లలో త. క). ఈ తలకణ మొక్కొక దాని నంటి ఆరు ముందలకణము (ముం. క.) లుండును (SuβHead Cells). ఈ ముందలకణమున కొక్కొకదానికి నాలుగు మిక్కిలి చిన్నవియు మృదువు నైన మెలికలుతిరిగిన బీజతంతువులను దారము లంటియుండును (20-వ పటములో A. B. లలో బీ. తం. చూడుము). ఈతంతువులు బూజుపోగుకణముల బోలియుండు చిన్నచిన్న కణముల పంక్తులు.
కాబట్టి యొక్కొక బీజాశయమునందు 8 పిళ్లును, పిడి యొకటింటి కారు ముందలకణములును, ఒక్కొక ముందల కణమునకు నాలుగు బీజతంతువులును చొప్పున మొత్తముమీద ఒక్కొక బీజాశయమునందు రమారమి రెండువందల (200) బీజతంతువు లుం (Spermatic filaments) డును. ఈ బీజతంతువు