Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎంత వెడల్పు గలదో అంత పొడుగుగా ఎదుగుసరికి జీవస్థానముకూడ విభాగమగుటకు ప్రారంభించును. కణముయొక్క వెడల్పుకంటె పొడుగు రెట్టింపుగా పెరుగువర కది పెక్కు జీవస్థానములుగా ఖండింపబడును. మరియు నం దనేకములప్పుడు చీలుచున్నట్టు చూడగలము.

వారిపర్ణి యంతయు నొక్క కణమునుండి పుట్టినది.

పై జెప్పబడిన అంశములబట్టి చూడ వారిపర్ణియు బూజుపోగువలెనే అంత్యకణమను నొక్కకణమునుండి పరిణమించినదే యని తెలియగలదు. కణవిభాగముచే స్కంధములు, స్కంధశిరములు, ఆకులును వేర్వేరుగా నేర్పడినతరువాత అవి వానివాని స్వభావములలో విస్తారము మార్పులు జెందక పరిమాణము నందుమాత్రము హెచ్చుచుండును.

శాఖోత్పత్తి.

ప్రతికొమ్మయు స్కంధశిరమునందుండు కణములలో నొకదానినుండి మొటిమగా బయలుదేరును. ఈ మొటిమకు శాఖాంకుర మని పేరు. ఈ మొటిమ యెల్లప్పుడును ఆకునకును గొమ్మకును నడుమ నుండు పంగలో నంకురించును. పిమ్మట నీ మొటిమ తల్లికణమునుండి ఖండింపబడి శాఖాంత్యకణముగా పరిణమించును. ఇ ట్లేర్పడిన అంత్యకణమునుండి పై జెప్పినరీతినే ప్రకాండ మేప్రకారము కణవిభాగముచే నేర్పడుచున్నదో అట్లే ఉపకాండములును సర్వవిషయముల ప్రకాండమును బోలి వృద్ధిబొందు